| |
కోళ్ళు
ప్రపంచంలోని గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం మూడవ స్థానం, కోళ్ళ మాంసము ఉత్పత్తిలో ఐదవ స్థానంలో వుంది. కోళ్ళ సంఖ్యలోను, గుడ్లు, మాంసము ఉత్పత్తిలోను మనరాష్ట్రం దేశంలోనే అగ్రస్థానాన వుంది.
కోళ్ళ పరిశ్రమల వివరాలు (2005 లెక్కలు)
|
సంకర జాతి గుడ్ల కోళ్ళు |
గుడ్ల ఉత్పత్తి |
బ్రాయిలర్లు |
భారతదేశం ఉత్పత్తి(కోట్లలో) |
18.9 |
4,455 |
160 |
ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి(కోట్లలో |
6.5 |
1.690 |
16 |
|
|
గుడ్ల కోళ్ళ జాతులు, వాటి బ్రీడింగ్ పద్దతులు
దేశవాళి కోడి, గుడ్ల ఉత్పత్తిలో చాలా వెనుక బడివుంది. అందుచేత గుడ్ల దిగుబడి పెంచేందుకు, విదేశీ జాతులు మరియు వాటినుండి వచ్చిన సంకర జాతులు మన దేశంలోకి దిగుమతి చేసుకొబడ్డాయి. వీటిలో వైట్ లెగ్ హార్న్ ముఖ్యమైనది. ఎక్కువ సంఖ్యలో గుడ్లు పెట్టటానికి వైట్ లెగ్ హార్న్ కోళ్ళ నుండి రూపొందించిన సంకరజాతి కోళ్లు సాధారణంగా ఉపయోగించబడుచున్నవి.
మార్కెట్లో హెచరీలు పంపిణి చేస్తున్న కోడి పిల్లలు, ఇన్ బ్రిడ్ హైబ్రిడ్ పద్దతిలో రూపొందించబడ్డాయి. ఈ సంకర జాతి కోళ్లు మంచి యాజమాన్యంతో ఏడాదికి 290 -320 గుడ్లు పెడుతాయి.స్వచ్చమైన జాతులకన్నా హైబ్రిడ్ కోళ్ళు దాదాపు ప్రతి కోడి పెట్ట 40-60 గుడ్లు ఎక్కువ పెడుతుంది. ఈనాటి గణనీయమైన గుడ్ల ఉత్పత్తి పెరుగుదలకు ఇదే ప్రధాన కారణం.. |
|
మేత
మంచి మేతకు ఉండవలసిన లక్షణాలు
- మేత తక్కువధరలో, కావలసిన పోషక విలువలు కలదిగా ఉండాలి.
- తాజాగా, శుభ్రంగా ఉండి, తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు కలిగి యుండాలి.
- కోళ్ళు పీచును జీర్ణించుకోలేవు కాబట్టి మేతలో పీచు పదార్థాలు 10 శాతం మించకుండా ఉండాలి.
కోళ్ళ పెరుగుదలకు, గుడ్ల ఉత్పత్తికి, పోషక పదార్థాలు అతి ముఖ్యం. మేతలో పోషక పదార్థాల లోపాల వల్ల కోళ్ళు సరిగా ఎదగవు. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇతర రోగాలు తాకిడికి గురవుతాయి.
రైతు తన కోళ్ళకు కావలసిన మేతను తానే తాయారు చేసుకోవచ్చు. సాధారణంగా కోడి మేతలో ఉపయోగించే పదార్తాలను శక్తినిచ్చేవిగాను, మాంసకృతుల నిచ్చేవిగాను, విటమిన్లు, ఖనిజలవణాలనిచ్చేవిగాను, ఎడిటివ్సుగాను విభజించవచ్చు. శక్తి నిచ్చే వాటిలో మొక్కజొన్నలు, సజ్జ మరియు ఇతర చిరుదాన్యాలు, బియ్యపు తవుడు, నూని తీసిన వరితవుడు, మొదలగునవి ముఖ్యమైనవి. దాణాలో దాదాపు 60 శాతం ఇవేవుంటాయి.వృక్ష సంభందిత మాంసకృతుల నిచ్చే వాటిలో వేరుశనగ పిండి , నువ్వులపిండి, సొయబీనుపిండి , ప్రొద్దుతిరుగుడు పువ్వు పిండి మొదలగునవి మరియు జంతు సంభందమైన మాంసకృతుల్లో చేపపొడి, మాంసపు పొడి ముఖ్యమైనవి.
కోడి వయస్సును బట్టి పోషకావసరాలు కూడా మారుతాయి. కాబట్టి దాణా కూడా మారుతుంది. చిన్న పిల్లలకిచ్చే దాణాలో(1 నుండి 8వారాలు) శక్తి 2800 కిలో కేలరీలు, 22శాతం మాంసకృతులు, పెరిగే పిల్లకిచ్చే దాణాలో (9నుండి 20 వారాలు) 2600కిలోల కేలరీలు శక్తి, 18 శాతం మాంసకృతుల్లో దాణా ఉండేటట్లు చేయాలి. ఈ అవసరాలను దృష్టిలో వుంచుకొని, లభిస్తున్న ముడి ఆహార పదార్థాలను ఉపయోగించి, దాణా తాయారు చేసుకోవచ్చు. గుడ్లు పెట్టే కోళ్ళ దాణాకి, మిగతా పిల్లల దాణాకి ముఖ్యమైన తేడా కాల్షియం మరియు అమైనో ఆసిడ్స్, కాల్షియం పిల్లలకి 0.9-1 శాతం సరిపోతే, పెద్దకోళ్ళకు 2.5 నుండి 3 శతం వరకు ఇవ్వాలి. వీటితో పాటు, విటమిన్లు, లవణ మిశ్రమాలు, రోగనిరోదక మంధులు మొదలగున్నవి కూడా తగుపాళ్ళలో జత చేయవలసి వుంటుంది. కోడి కడుపులో(జీర్ణాశయంలో)ఆహారం జీర్ణం కావడానికి చిన్న గులకరాయి(గ్రిట్) అవసరం. ఈ “గ్రిట్ “ సున్నపురాయి రూపంలో కాని, ఆలుచిప్పల ముక్కలు లేదా పాలరాతి ముక్కల రూపంలో గానీ ఇవ్వవచ్చు.
- మేతలో కలిపే ధాన్యపు గిజలు, వేరుశనగ పిండి, చేప మొదలగు వాటిలో 12% కంటే ఈక్కువ తేమ కలిగియుండకూడదు. తేమ ఎక్కువగా వున్న యడల ఫంగస్ వల్ల అప్లటాక్సికోసిస్ అను రోగం వస్తుంది.
- చేపలలో ఉప్పు వుంటుంది. చేపను వాడినప్పుడు దాణాలోఉప్పు శాతం నిర్ణిత స్థాయికి మించకూడదు. దాణాలోచేప లేనప్పుడు, ఉప్పును లవణ మిశ్రమం ద్వారాగాని లేదా అదనంగా ఉప్పును(0.3%)కలపాల్సి ఉంటుంది.
- రోగనిరోదక మందులు తరుచుగా మార్చడం ముఖ్యం.
- చిన్నకోదిపిల్లల మేతలో విటమిన్లు, కాక్సిడియోస్టాట్ మొదలగు మందులు తప్పకుండా ఉండాలి.
- కోడి వయస్సు ప్రకారం ప్రత్యేకించి కేజ్ కోళ్ళకు కాల్షియం ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది.
- వేసవిలో మేతను కాస్తా తడిచేసి అందజేయాలి.
- మేత వృధా కాకుండా చూడాలి. దీనికొసం సరైన మేత తొట్లు, ఎలుకల నివారణ అవసరం.
|
|
వసతి
కోళ్ళ షెడ్లు - వాటి నిర్మాణం
షెడ్లు నిర్మాణానికి ఎంచిన స్థలం, మంచి నీటి వసతి, విద్యుచక్తి సరఫరా, మార్కెటుకు చేరువలో ఉండటం మున్నగు సదుపాయాలను కలిగి వుండాలి. షెడ్డు ఎత్తులో ఉంటే గాలి చలనం బాగా ఉండి, మురుగు నీరు నిల్వకు అవకాశం లేనటువంటి ప్రదేశాలను ఎన్నుకోవాలి.
షెడ్ నిర్మాణానికి ఆయా ప్రాంతాలల్లో సులభంగా తక్కువ ఖర్చులో దొరికే ఇటుక, కలప, బోద, కొబ్బరి లేదా తాటాకు మొదలగున్నవి కావచ్చు. కాని ఖర్చు తగ్గించే ప్రయత్నంలో షెడ్డును ఎలుకలకు, అగ్ని ప్రమాదాలకు అనువుగా నిర్మించకూడదు. ఇందుకు గాను కాంక్రీటు నేల, ప్రక్కలకు అల్లిన ఇనుపతీగ, పై కప్పుకు రేకులు వాడటం మంచిది. కోడి పిల్లలను, పెరిగే కోళ్ళను, గ్రుడ్లు పెట్టే కోళ్ళను వేర్వేరు షేడ్లల్లో పెంచడం మంచిది. అయితే చిన్న కారు రైతులకు ఇది సాద్యం కాదు కాబట్టి ఒకే షెడ్డును అన్ని దశల్లోని కోళ్ళ కొరకు వాడుకోవచ్చు. షెడ్డు వెడల్పు 25 నుండి ౩౩ అడుగులకు మించకుండా ఉండాలి. కోళ్ళ సంఖ్యను బట్టి పొడవు ఎంతైనా ఉండవచ్చు. షెడ్డు ప్రక్క గోడలు 1 అడుగు ఎత్తు ఉండి, ఆపైన 6-7 అడుగుల ఎత్తువరకు అల్లిన ఇనుపతీగను (వైరమేష్) అమర్చాలి. చూరు కనీసం 3-4 అడుగులుండేటట్లు చూడాలి. కప్పు ఆకారంలో షెడ్డు, గేబులు, మోనిటర్, మొదలగు రకాలున్నప్పటికీ, గేబులు సాధారణంగా వాడబడతాయి.
కప్పును ఆన్ బెస్టాస్ రేకులతో వేయుట మంచిది. షెడ్డులో ఎండపడకుండా ఉండుటకు గాను, షెడ్డును తూర్పు, పడమర దిశలో నిర్మించుకోవాలి. కోళ్ళను నేలమీద (డీప్ లిట్టరు) లేదా పంజరం ( కేజే)లో పెంచడానికి కావలసిన గృహవసతి వేరు వేరుగా వుంటుంది. కేజే గృహవసతి ఎత్తుగా వుండి, రెట్టను నేలమీద పాడేందుకు అనువుగా ఉండేలా చూడాలి. ఇలా చేయడం వలన ఈగలు బెడద దుర్వాసనలను అరికట్టవచ్చు.
ఒక్కొక్క కోడికి కనీసం 3-4 అం. మేత స్థలం, 1 అం. నీటి స్థలం లబించేలా చూడాలి. ఇందుకోసం తొట్టిల సైజు పెంచుకోవాలి. 10-12 కిలోల పరిమాణంగల మేత తొట్టి సుమారు 20-25 కోళ్ళకు సరిపోతుంది. దాణా మిశ్రమం ఒక రకం నుండి వేరొక రకానికి క్రమంగా మార్చాలి. లిట్టరు తడిగా ఉండి, అమ్మోనియా వాసన వచ్చే పరిస్థితుల్లో 10 చ. అలకు. 1 కిలో పొడిసున్నాన్ని కలిపినచో చెడువాసన నివారింపబడి కోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.
ప్రతి కోడికి 1.5 నుండి 2 చ. అ. స్థలాన్ని కేటాయించాలి. దగ్గరలోని ఫరంలలోకాని, అదే ఫారంలలో కాని ఏవైనా రోగాలు ప్రభలినపుడు అవసరాన్ని బట్టి మందులు లేదా టీకాలు వేసి కోళ్ళను కాపాడవచ్చు. పెరిగేదశలో ఎక్కువసమయం వేలుతురునిస్తే గర్భసంచి బయటికి వచ్చి (ప్రాలాప్స్) చాలా సమస్యలు కలిగిస్తాయి. కోళ్ళు గుడ్లు పెట్టడం మొదలు అయిన తరువాత ఒక సంవత్సరము వరకు అంటే కోడి వయసు 72 వారాల వరకు లాభదాయకంగా పెంచవచ్చును. |
|
రోగాలు – టీకాలు
కోళ్ళ పెంపకంలో లోపాలున్నట్లయితే అంటువ్యాధులు ప్రబలి , ఒక్కోసారి తీవ్రనస్టాన్ని కలుగ జేస్తాయి. కాబట్టి షెడ్ లో శుభ్రత, ఆరోగ్య సూత్రాలు పాటించాలి. కోళ్ళకు అంటువ్యాధులు సుక్ష్మ క్రిములు వలన వస్తాయి.
వైరస్ వలన కలిగే వ్యాధులు
కొక్కెర తెగులు :
ఈ వ్యాధి మిగతా వ్యాదులన్నింటి కంటే భయంకరమైనది. ఈ వ్యాధి వల్ల ఎక్కువ సంఖ్యలో కోళ్ళు చనిపోతాయి. ఈ వ్యాధి ఏ వయస్సు కోళ్ళకైనా రావచ్చు. ఈ రోగానికి గురైన కోళ్ళు ముడుచుకొని ఉండి రెక్కలు వేలాడదీస్తాయి. పక్షవాతపు లక్షణాలు కనిపిస్తాయి. మెడ వెనక్కి వాలుతుంది. విరేచనాలు తెలుపు, ఆకుపచ్చ రంగులలో ఉంటాయి. శ్వాశలో కుఉడా ఇబ్బంది కలుగుతుంది. సన్నని రక్తపు గడ్డల చుక్కలు ‘గిజర్డు’ మరియు ‘పెరికార్డియం’ లో కనబడుతాయి. “ప్రొవెం క్యులాస్”లో సన్నని రక్తపు చుక్కలుంటాయి. ప్రేగులో పొరలు ఎర్రబారటం, “సీకా” జంక్షన్ లో రక్తపు జీరలుంటాయి. ప్రేగుల్లో “అల్సర్ ఉండవచ్చు. నివారణకు మొదటి వారం, 4వ వారం, ఆ తరువాత 6-8 వారాల మధ్య మరొకసారి, చివరగా 20వ వారం టీకాలు వేయటం వలన చాలా వరకు కోళ్ళను ఈ రోగం నుండి రక్షించుకోనవచ్చు.
మశూచి:
కోళ్ళ అంటువ్యాధుల్లో ఇదొకటి. ఈ వ్యాధి వలన చనిపోవుట కాని, గ్రుడ్ల ఉత్పత్తి తగ్గిపోవుటగాని జరుగుతుంది. మశూచి సోకిన కోళ్ళకు జుట్టుమీద, తమ్మేలకు, కనురెప్పల చుట్టూ పొక్కులు ఏర్పడతాయి. అపుడపుడు కండ్లలో కూడా ఈ పొక్కులు వచ్చి కళ్ళు కనబడవు. నివారణకు టీకాలు వేయించడం ఒక్కటే మార్గం. ఇవి 6- 7 వారాల వయసు లోనూ మరల 16-17 వారాల మధ్య వేయాలి.
మారెక్స్ వ్యాధి:
ఈ వ్యాధి అన్ని వయసు కోళ్ళకు వస్తుంది. వ్యాధి సోకిన కోళ్ళు 5 నుండి 60 శతం మరణిస్తాయి.రెక్కలు వాలిపోవటం, సరిగా నిలబడలేక పోవటం, పక్ష వాటం వచ్చి కదలలేక పోవటం, గుడ్ల ఉత్పత్తి తగ్గి పోవటం మొదలగు లక్షణాలు కనిపిస్తాయి. రెక్కలక్రింద నున్న “బ్రేకియల్ “ నరం మరియు తోడ కండరాల క్రింద నున్న “సియోటిక్” నరం ఉబ్బి లావుగా ఉంటాయి. కాలేయం, స్ప్లిన్ , అండాశయము పెద్దవిగా వుంటాయి. నివారణకు పుట్టిన రోజునే పిల్లలకు (హెచరీ వద్దె) టీకాలు వేయించాలి. కోళ్లలో జబ్బు కనబడిన తరువాత మిగతా కోళ్ళకు టీకాలు వేయకూడదు.
ఇవి కాక ఇన్ ఫెక్షియన్ బ్రాంకైటిస్, ఇన్ ఫెక్షియన్ బర్సల్ డిసీజ్ , క్రానిక్ రేస్పిరేటరి డిసీజ్ మొదలగునవి కుడా తరచు కనిపిస్తాయి. వీటిని సంబంధిత టీకాలు వేసి నివారించవచ్చు.
సుక్ష్మ జీవుల వల్ల కలిగే రోగాలు
పుల్లోరం :
చిన్న పిల్లలు ఎక్కువగా గిరికాబడుతాయి. ఈ వ్యాధి తల్లినుండి పిల్లలకు గుడ్ల ద్వారా కుడా సంక్రమిస్తుంది. రోగం సోకిన పిల్లలు గుంపులుగా గుమికుడటం, భారంగా శ్వాస తీయడం, రెక్కలు వాల్చడం గమనించ వచ్చు. తెల్లని రెట్ట పిల్లల మలద్వారం వద్ద అంటుకొని వుంటుంది. గుండె, గిజర్డ్ , కాలేయం మరియు పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు ఆంటీ బయోటెక్ మందులు వాడాలి.
ఇవికాక కోళ్ళ కలరా, ఇన్ ఫెక్షియన్ కోరైజా అనే రోగాలు కూడా సోకవచ్చు.
కాక్సిడియోసిస్(రక్త పారుడు రోగం) :
ఇది చిన్న పిల్లల్లో ఎక్కువ కనబడుతుంది. కోళ్లలో ధారుడ్యత, వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. రోగం సోకిన పిల్లలు గుమికూడి, రక్త విరేచనాలతో భాదపడతాయి. “సీకా” అనే భాగం ఉబ్బి వుంటాయి. నివారణకు లిట్టరు పొడిగా ఉండాలి. దాణాలో కాక్సిడియోస్పాట్స్ సక్రమంగా కలుపుతుండాలి. అంతర్గత పరాన్న జీవులు : ఏలిక పాములు, బద్దె పురుగులు తరుచు కోళ్ళను బాధిస్తాయి. వీటి నివారణకు పైపరిజన్, లివమిసోల్, మొబెండజోల్ మొదాలైన మందులతో ఆపుడపుడు డీవర్మింగ్ చేయడం వలన నివారించ వచ్చు.
భాహ్య పరాన్న జీవులు :
కోళ్ళకు పేలు, పిడుదులు, గోమారి, నల్లులు వంటి కీటకాలు తీవ్ర అసౌకార్యం కలిగిస్తాయి. వీటి బెడద శీ తాకాలంలో ఎక్కువ వుంటుంది. కోళ్ళ మిదగాని, షెడ్ లోగాని ఈ కీటకాలు కనబడగానే కీటక సంహారక మందును వాడి నివారించవచ్చు. సేవిన్ (0.5 శాతం) లేదా మాలాథియాన్ (0.5శాతం) లేదా సుమిథియాన్ ను కోళ్ళపై మరియు షెడ్డు లోపల, బయట పిచాకారి చేసి ఈ వ్యాధులను నివారించవచ్చు.
కోళ్ళ టీకాల కార్యక్రమం
వయస్సు |
వ్యాధి |
టీకామందు |
ఇచ్చే విధానం |
ఒకరోజు |
మెరేక్స్ |
మెరేక్స్ వ్యాక్సిన్ |
ఒక గొట్టంలో 1000 పిల్లలకు సరిపోయే మందు ఉంటుంది. దీనిని 200 మి,లీ. డైల్యుయంట్ తో కలిపి, ప్రతి పిల్లకు 0.2 మి,లీ. చొప్పున ఇంజక్షన్ మెడ భాగాన గల చర్మం క్రింద ఇవ్వాలి. దీని ప్రభావం 18 నెలల వరకు ఉంటుంది. హెచరీ వారు వేస్తారు. |
4-7 వ రోజు |
కొక్కెర తెగులు |
ఎఫ్ – 1 (లసోట) |
వాక్సిన్ గొట్టంలో మందును 10-15 మి.లీ. సెలైన్ ద్రావణం లో కలిపి, ఒక్కొక్క చుక్క చొప్పున ప్రతి పిల్లకు కంటిలో లేక ముక్కులో వేయాలి. ఇది కోడి పిల్లకు 2-4 నెలల వరకు రక్షణ కలిగిస్తుంది |
14-15వ రోజు |
గంబోరో |
ఇంటర్మీడియట్ స్ట్రైన్ |
బాటిల్ లోని వాక్సీనుకు దాని వెంట యిచ్చిన డైల్యుయంట్ కాలిపి, ఒక చుక్క ఒకకోడి పిల్లకు కంటిలో గాని, ముక్కు రంద్రం లో గాని, నోటిలో గాని వేయాలి |
18-19 వ రోజు |
మెరేక్స్ (మరోసారి) |
మెరేక్స్ వాక్సిన్ |
ఒక గొట్టంలో 1000 పిల్లలకు సరిపోవు మందు వుంటుంది. దీనిని 200మి.లి. డైల్యుయంట్తో కలిపి, ప్రతి పిల్లకు 0.2 మి,లీ.చొప్పున ఇంజక్షన్ మెడ భాగాన గల చర్మం క్రింద ఇవ్వాలి. దీని ప్రభావం 18 నెలల వరకు వుంటుంది |
21-25వరోజు |
గంబోరో (మరొకసారి) |
ఇంటర్మీడియట్ స్ట్రైన్ |
బాటిల్ లోని వాక్సిన్ కు దాని వెంట ఇచ్చిన డైల్యుయంట్ కలిపి, ఒక చుక్క ఒక కోడి పిల్లకు కంటిలో గాని, ముక్కు రంద్రంలో గాని, నోటిలో గాని వేయాలి. లేక కొన్ని జాగ్రత్తలతో నీటిలో కలిపిగాని ఇవ్వవచ్చు |
4 వ వారం |
కొక్కెర తెగులు ఇన్ ఫెక్సియాస్ బ్రాంకైటిస్ (ఐ,బి) |
లసోట + ఐ.బి |
పై విదంగా గాని, నీటిలో గాని ఇవ్వవచ్చు |
7 వ వారం |
కోళ్ళ మశూచి |
ఫౌల్ ఫాక్స్ వాక్సిన్ |
గొట్టంలో మందును షుమారు 5 మి.లీ. గ్లిజరిన్ సెలైన్ తో కలిపి, దీనిలో ముంచిన సూదితో రెక్కలో గ్రుచ్చిన వ్యాధి నిరోధక శక్తి 1 ½ సం. వుంటుంది. ఇది కుడా 4 నెలల వయస్సులో తిరిగి చేయాలి. గోట్టంలోని మందును డైల్యుయేంట్ తో కలిసి కండరం లోకి కూడా ఇవ్వవచ్చు |
8 వవారం |
కొక్కెర తెగులు, |
ముక్తేశ్వర్ రకం |
గొట్టంలోని మందును కొక్కెర తెగులు డైల్యుయేంట్ కలిపి, ½ మి.లీ. ఒక కోడికి చర్మం క్రింద గాని లేక కండరంలోకి గాని ఇంజక్షన్ ఇవ్వాలి |
13వ వారం |
ఇన్ ఫెక్సియస్ బ్రాంకైటిస్ (ఐ,బి,) |
ఐ,బి, వాక్సిన్ |
గొట్టంలోని మందు వెయ్యి కోళ్ళకు సరిపోతుంది. త్రాగునీటిలో కలిపి ఇవ్వాలి. |
14వ వారం |
కోళ్ళ మశూచి |
ఫాల్ ఫాక్స్ వాక్సిన్ |
గొట్టం లోని మందు వెయ్యి కోళ్ళకు సరిపోతుంది. ఈ మందు రెక్కలో గ్రుచ్చి గాని లేక ఇంజక్షన్ రూపంలో గాని ఇవ్వవచ్చు. |
16వ వారం |
కొక్కెర తెగులు (మరోసారి) |
ముక్తేశ్వర్ రకం |
గొట్టంలోని మందును కొక్కెర తెగులు డెల్యుయంట్ కలిపి, ½ మి,లీ, ఒక కోడికి ఇంజక్షన్ వేయాలి. |
40 – 45వ వారం |
కొక్కెర తెగులు
(మరొకసారి) |
లసోట వాక్సిన్ |
మామూలుగ ఇచ్చేదాని కంటే రెండింతలు పరిమాణం నీటిలో కలిపి కోళ్ళకు త్రాగునీటిద్వారా ఇవ్వాలి. |
టీకాల మందులు - జాగ్రత్తల
- టికామందులుఎప్పుడు ఐసులో లేక ఫ్రిజ్ లల్లో ఉంచాలి.
- ఇతర రోగాలు ఉన్నప్పుడు టీకాలు వేయకూడదు.
- కోళ్ళ అస్వస్థత లేదా స్త్రే స్ తో ఉన్నప్పుడు టీకాలు వేయరాదు.
- టీకాలు రాత్రి వేళల్లో వేయడం మంచిది.
- టీకా మందు సిసానుండి తీసి కలిపిన తరువాత 2 గంటలలోపే వాడాలి.
|
|
వేసవిలో కోళ్ళ పెంపకం :
కోడి శరీరనిర్మాణం చలిని తట్టుకోనేవిదంగా మలచబడింది. కాబట్టి, ఎక్కువ ఉస్ణోగ్రతకు కోడి తట్టుకోలేదు. ముఖ్యంగా వాతావరణ ఉష్ణోగ్రత, శరీర ఉష్ణోగ్రతకన్నా ఎక్కువవున్నప్పుడు,కోళ్ళు ఆయాసపడుతూ తక్కువ మేత తింటాయి. ఎక్కువ నీళ్ళు తాగుతాయి. తీవ్ర పరిస్థితుల్లో వడదెబ్బకు చనిపోయే ప్రమాదంకుడావుంది. 80 డిగ్రీల ఫారన్ హీట్ వరకు కోళ్ళకు సదుపాయంగా వుంటుంది. ఆపై ఉష్ణోగ్రతల్లో కోడి యొక్క దేహ రసాయన ప్రక్రియ దెబ్బతింటుంది. గుడ్ల ఉత్పత్తి బాగా పడిపోతుంది. అందుచేత వేసవిలో కోళ్ళ షెడ్లను సాద్యమైనంతవరకు చల్లగా ఉండేటట్లు చూడాలి. దీనికోసం ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.
- కోళ్ళ షెడ్లు ఎపుడు తూర్పు పడమరలుగా కట్టుకుంటే ఉదయం ఎండ, సాయంత్రం ఎండ షెడ్లోనికి ప్రసరించదు.
- షెడ్ చుట్టూ కొద్ది ఎత్తువరకు గడ్డి పెంచటం లేక నీడనిచ్చేచేట్లను పెంచటం వలన కూడా వేడిని తగ్గించవచ్చును.
- పైకప్పులకి తెల్లని రంగువేసి, లేదా ఆపై గడ్డి పరచి, స్ప్రింక్లర్లతో తడిపితే మంచిది. ముఖ్యంగా వాతావరణంలో తేమ ఎక్కువగా వున్నప్పుడు షెడ్ లో ఫంఖాలు నడపడం మంచిది.
- చల్లని నీరు అన్నివేళలా కోళ్ళకు అందుబాటులో ఉండాలి. షెడ్ లో సీలింగు ఫంకాలను అమర్చవచ్చు. షెడ్ ప్రక్కలందు గోనేసంచులుకాని, వట్టివేళ్ళ తడికలను గాని కట్టి తరుచుగా నీటితో తడిపితే మంచి ఫలితం కనిపిస్తుంది. నీటి తోట్టెలు షెడ్ లోపల వుండడం మంచిది.
- కోళ్ళ వయసు మరియు ఎండ తీవ్రతను బట్టి దాణాలో ముఖ్య అమినోఆమ్లాలు (మితియోనిను), విటమిన్లు, ఖనిజాలు (సున్నం, భాస్వరం)శాతం పెంచాలి.
- వేసవిలో పేలు, నల్లులు మొదలగు బాహ్య పరాన్న జీవులు బెడద ఎక్కువగా వుంటుంది. మాలాథియాన్ మొదలగు మందులను షెడ్ నందు కోళ్ళపై పిచాకారి చేయటం వలన వీటిని నివారించవచ్చు.
- వేసవిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి రోగాలు ప్రబలకుండా టీకాలు చల్లటి పూట లేదా రాత్రుల్లో వేయించాలి.
- గుడ్ల నాణ్యతను కాపాడేందుకు ఎక్కువసార్లు గుడ్లను ఏరటం మంచిది.
- మేతను ఉదయం మరియు సాయంత్రం సమయాలల్లో ఇవ్వటం వలన కోళ్ళు మేత ఎక్కువగా తినగాలవు.
- మేతను కొంచెం నీటితోతడిపి ఇచ్చిన కోళ్ళు మేతను ఎక్కువ తినగలవు. దాణా తోట్టేల్లో బూజు పడకుండా చూడాలి.
|
|
కోడి పిల్లల పెంపకం
పుట్టినప్పటి నుండి 8 వారాల వయస్సు వచ్చే వరకు గల దశను ‘పిల్లదశ’ లేదా స్టార్టరు దశ అటారు. కోళ్ళ పెంపకంలో దాదాపు 5 లేక 6 శాతం ఖర్చు చిన్న పిల్లల కొరకు వినియోగించబడుతుంది. ఈ దశ లో కోడిపిల్లలు సున్నితంగా ఉండి తక్కువ రోగ నిరోధక శక్తి కలిగి వుంటాయి. కాబట్టి వాటి పోషణలో ప్రత్యేక శ్రద్ద వహించాలి. అపుడే అవి వాతావరణ పరిస్థితులు నెదుర్కొని చక్కగా పెరిగి సమర్థవంతమైన గుడ్లు పెట్టే కోడిగా మారగల్గుతుంది. వీలైనంతవరకు ఒక రోజు వయస్సు పిల్లలతో పరిశ్రమ ప్రారంబించటం మంచిది.
కోడి పిల్లల రాకకు పది రోజులు ముందుగా షెడ్డులోని బూజు, దుమ్ము దులిపి, శుభ్రపరిచి, గోడలకు సున్నంవేయించాలి. బ్రూడరు, మేత తొట్లు, నీటి తొట్లు కడిగి క్రిమి సంహారక మందుతో శుభ్రపరిచాలి. వారి పొట్టు లేక వేరుశనగ పొట్టు 2-3 అంగుళాల మందంలో నేలపై పరచాలి (లిట్టరు). లిట్టరు పైన కాగితాలు పరచాలి. కోడి పిల్లల మేత తొట్లు, నీటి తొట్లు, బ్రూడరు క్రంద బండి చక్రంలోని ఆకులలాగా ఒక దాని తరువాత ఒకటి అమర్చాలి. మొక్కజొన్న నూకను కాగితం పై పలుచగా చల్లాలి. బ్రూడరు చుట్టూ 2-3 అడుగుల దూరంలో 18 అం. ఎత్తుగా అట్టగాని, రేకులుగాని వృత్తాకారంలో రక్షక దాడిగా అమర్చాలి.
బ్రూడింగ్
కోడి పిల్లలు తొలిదశలో పరిసరాలు ఉస్ణోగ్రత మార్పులకు తట్టుకోనెంతటి శక్తి కలిగి ఉండవు. అందువల్ల కృత్రిమంగా వేడి ఇవ్వటాన్ని “బ్రూడింగ్” అంటారు. ఈ బ్రూడింగ్ ఆయా ప్రదేశాల వాతావరణ పరిస్థితులను బట్టి 4-6 వారాల వరకు అవసరం. అయితే బ్రూడింగ్ కు ఉపయోగించే బ్రూడరు క్రింద వేడిని కోడి పిల్లల వయస్సుని బట్టి క్రమంగా 90 – 95 డిగ్రీల ఫారన్ హీట్ నుండి 70 – 75 డిగ్రీల ఫారన్ హిట్ కు (వారానికి 5 – 7డిగ్రీలF) తగ్గించాలి. బ్రూడరు క్రింద వేడి ఎక్కువైతే పిల్లలు దూరంగా వెళ్ళిపోతాయి. తక్కువైనట్లయితే పిల్లల్ని మద్యలో గుంపుగా ఉంటాయి. దీన్ని బట్టి వేడిని అంచనా వేసి వేడిని తగ్గించడమో చేయాలి. 4 అడుగుల వ్యాసం గల బ్రూడరు క్రింద 250 నుండి 300 పిల్లలను పెంచవచ్చు.
కోడి పిల్లలు వచ్చిన తరువాత ముందుగా అమర్చిన బ్రూడరు క్రింద వదిలేముందు కొన్ని పిల్లల (5 లేదా 10)ముక్కు నీటి తొట్లలో ముంచాలి. దీనితొ అవి నీరు త్రాగడానికి అలవాటు పడతాయి. చుట్టూ అమర్చిన అట్టదడిని 2 రోజులకొకసారి క్రమంగా దుఉరంగా జరుపుతూ, 10వ రోజున పూర్తిగా తీసివేసి గది మూలలందు అట్టలను అమర్చాలి. బ్రూడరు క్రింద కాగితం 5 లేక 6 రోజులు తరువాత తీసివెయాలి.
ప్రతి 50 పిల్లలకు ఒక మేత తొట్టి మరియు నీటి తొట్టి అమర్చాలి. మొదటి వారంలో ఒక పిల్లకు ఒక అంగుళం స్థలం చొప్పున, 50 పిల్లలకు దాదాపు 24 అం. పొడవుగల మేత తొట్టి సరిపోతుంది. ప్రతి బ్రూడరు క్రింది అంచున 3-4 నీటి తోట్లను అమర్చాలి. వాటిని రొజూ శుభ్రపరచి మళ్ళి నీటితో నింపుకోవాలి.
పిల్లల గృహంలో రాత్రంతా లైట్లు వెలుగుతూఉండాలి. పిల్లలకు మొదటి 7 – 10 రోజుల మధ్యలో “డీ బీకర్”అను పరికరం సహాయంతో ముక్కును కత్తరించాలి. దీని వలన పిల్లలు ఒకదాన్నొకటి పోడుచుకోనుటం, మేతను తొట్లనుండి కిందకు తోయుట తగ్గుతుంది.
సాధారణంగా పుట్టిన రోజునే కోడిపిల్లలకు హెచరీవారు మేరెక్స్ రోగానికి టీకా వేస్తారు. తరువాత సామాన్య రోగాలైన కొక్కర తెగలు, గంబోరో మరియు మశూచి వ్యాధులకు ఈ దశలో తగిన మోతాదు మరియు పద్దతుల్లో టీకాలను వేయించాలి. రక్తపారుడు రోగం (కాక్సీ)రాకుండా మేతలో కాక్సిడియోస్టాట్ మందులు, ఏంప్రాలు లేక డాట్ వంటి మందులను కంపెనీవారు సూచించిన మోతాదులో కలపాలి.
ముఖ్యమైన విషయాలు
- ప్రతిరోజు 2 లేదా మూడుసార్లు కోడిపిల్లల ఆరోగ్య అవసరాలను చూడాలి.
- చిన్న పిల్లలను పెంచే షెడ్డుకు మరియు పెద్ద కోళ్ళ షెడ్డుకు మధ్య కనీసం 100 గజాలదూరం ఉండాలి.
- పెద్దకోళ్ళ షెడ్డులో పనిచేసే వ్యక్తి చిన్న పొల్లల షెడ్డులో ప్రవేశించరాదు.
- ఎల్లప్పుడు లిట్టరు తడికాకుండా పొడిగా ఉండునట్లు జాగ్రత్తపడాలి.
- నాటు జాతి కోళ్ళను షెడ్డు ఆవరణం లోనికి రానియ్యకూడదు. షెడ్డు ద్వారంలో క్రిమి సంహారక మందు ఉంచిన తొట్టి వుంచి షెడ్డులోకి ప్రవేశించే మందు పాదాలను ఆ ద్రావణంలో తడపాలి.
- శీతాకాలంలో కోళ్ళ బ్రూడింగు పటిష్టతకు గ్యాసు బ్రూడింగు వాడటం మంచిది. ఈదురగాలి సోకకుండా షెడ్డుకు యురువైపుల గొనె పట్టలను లేదా ప్లాస్టిక్ పరదాలను అవసరమున్నంత మేరకు వేలాడదియాలి.
|
|
పెరిగే వయస్సు (9 – 20 వారాలు) కోళ్ళ పెంపకం :
ఈ దశలో కోళ్ళను ప్రత్యేకమైన షెడ్డులో కాని లేదా సాధారణంగా చిన్న పిల్లల నుంచిన షెడ్డులో కాని పెంచవచ్చు. ప్రతి పెరిగే కోడి పిల్లకు వయసుని బట్టి 1-1.5 చదరపు అడుగుల స్థలం కావసి ఉంటుంది. మేత తోట్టెలు, నీటి తోట్టెలు పిల్లలకుపయోగించిన వాటికంటే పెద్దవిగా వుండాలి. దీనికిగాను ప్రతికోడికి 2.5 అం. మేత తినే స్థలం, 0.75 అం. నీరు త్రాగే స్థలం అవసరం. ఈ తొట్లు పొడవుగా గాని, వృత్తాకారంగా గాని ఉండవచ్చు. రాత్రులందు వెలుతురు ఇవ్వనవసరం లేదు.
ముక్కులను మరొకసారి 12 – 16 వారాల మధ్య కత్తిరించటంగాని, మొండిగా గాని చేయటం ముఖ్యం. లిట్టరును అప్పుడప్పుడు తిరిగ వేస్తూ, పొడిగా ఉండేటట్లు చూడాలి. అవసరమైతే కొత్త లిట్టరు చల్లుకోవాలి.
ఈ వయస్సులో కోడి పిల్లల కడుపులో ఏలిక పాములు, బద్దె పురుగులు పెరిగే అవకాశం కలదు. వీటి నివారణకు మందులు వాడాలి. లిట్టరుపై పడ్డ పురుగులను ఏరివేసి లిట్టరును బాగా తిరగవేయాలి.
ఈ వయస్సులో, నాసిరకపు పిల్లలను వేరుచేసి వాటి పోషణలో ప్రత్యేక శ్రద్ద వహించాలి. ఈ వయసులో రెండవసారి కొక్కెర తెగులుకు, మశూచికి బూస్టరు డోసు టీకాలు వేయాలి. సాదారనంగా 18-20 వారాల వయసు వచ్చేటప్పటికి కొన్ని కోళ్ళు గుడ్లు పెట్టడం మొదలు పెడుతాయి. కాబట్టి ఈ వయసులో షెడ్లో గూల్లను అమర్చాలి. ప్రతి 5 కోళ్ళకు ఒక గూడును చొప్పున అమర్చాలి.
గుడ్లు పెట్టే కోళ్ళకు ప్రత్యక షెడ్డు ఉన్న ఎడల, 16 లేక 17 వారల్లో కోళ్ళను ఆ షెడ్లోనికి మార్చుకోవాలి. ఇలాచేయడం వలన క్రొత్త వాతావరణానికి అలవాటు పడటానికి వాటికి తగినంత అవకాశం ఉంటుంది.
గుడ్ల కోళ్ళ పెంపకం (20 వారాలపైన) :
ఈ దశలో ఈ విధమైన ప్రయాస కలుగకుండా చూసుకోవడం, అతిముఖ్యం. టీకాలు, ముక్కులు రెండవసారి కత్తిరించటం మున్నగు కార్యక్రమాలు కోళ్ళు గుడ్లు పెట్టే దశకు చేరకుముందే పూర్తీ చేయాలి.
ఈ దశలో కోళ్ళకు రోజుకు 14 – 16 గంటలు వెలుతులు అవసరం. పగటి వెలుతురుతోపాటు అదనంగా 4 -5 గంతల పాటు రాత్రి పూట వెలుతురు ఇవ్వాల్సి వుంటుంది (వారానికి 1 గం,, చొప్పున). కాబట్టి 19-20 వ వారం నుంచి క్రమంగా వెలుతురు సమయాన్ని 24 వారాలకు 16 గం.. వచ్చేవరకు పెంచాలి. షెడ్లోని వెలుతురు, కోళ్ళ యొక్క గుడ్ల ఉత్పత్తికి దోహదం చేస్తుంది కాబట్టి, ఈ విషయాన్ని విష్మరించకూడదు. ప్రతి 200 చ.అ. స్థలానికి ఒక 40 వాట్ల బల్బునుకాని, ట్యూబులైటునుకాని అమర్చాలి.
గుడ్లు పెట్టని కోళ్ళను ఏరివేయటం
కోళ్ళ పెంపకం లాభసాటిగా జరగడానికి, నాసిరకమయిన కోళ్ళను తరుచు ఏరివేయటం ముఖ్యం. కోళ్ళు గుడ్లు దశకు వచ్చిన తరువాత మూడు మాసాల నుండి ప్రతి నెల గుడ్లు పెట్టని కోళ్ళను ఈ క్రింది లక్షణాలు గమనించి ఏరివేయాలి.
శరీరభాగము, శ్రేష్టమైన కోళ్ళు, నాసిరకం కోళ్ళు, 1 జుట్టు వుంటుంది. పెద్దదిగా, మృదువుగా గులాభి రంగులో వుంటుంది. చిన్నవిగా, గరుకుగా, పాలిపోయి వుంటుంది. 2. కటివలయ భాగం, వెడల్పుగా మెత్తగా వుంటుంది. రెండు వేముకల మధ్య రెండువేల్లకు పైగా వెడల్పుగా వుంటుంది. చిన్నదిగా కొంచెం గట్టిగా వుంటుంది. ఎముకలు మధ్య స్థలం ఇరుకుగా ఉంటుంది. 3.కడుపుబాగం ఛాతి ఎముకకు, ఉదర భాగం ఎముకకు స్థలం 3-4వీళ్ళ వెడల్పుగా ఉంటుంది. గట్టిగా ఉండి, ఛాతి ఎముకకు, ఉదర ఎముకకు మధ్య ఇరుకుగా ఉంటుది.
నాసిరకపు కోళ్ళు అవకుండా తగు యాజమాన్య పద్ధతులను గృహవసతి, నాణ్యతగల దాణా, రోగనిరోధక శక్తి రోజువారి పోషణలో సక్రమమైన చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. అన్ని దశల్లోనూ ఈ నాసిరకపు కూళ్ళు ఏరివేత పాటించినట్లయితే ఆరోగ్యవంతమైన కాళ్ళతో ఫారం లాభదాయకంగా సాగుతుంది. |
|
| |
| |
|
 |